చెన్నై శ్రీవారి ఆలయంలో విదేశీ కరెన్సీ దారి మళ్లింపు... టీటీడీ ఉద్యోగి కృష్ణకుమార్ పై వేటు

- BSR NEWS
- చైన్నైలోని శ్రీవారి ఆలయంలో పరకామణిలో ఉద్యోగి చేతివాటం
- సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కృష్ణకుమార్
- విజిలెన్స్ విచారణలో తప్పు చేసినట్టు తేలిన వైనం
టీటీడీ దేశవ్యాప్తంగా పలు శ్రీవారి ఆలయాలను నిర్వహిస్తోంది. అయితే చెన్నైలోని ఆలయంలో పరకామణిలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించినట్టు వెల్లడైంది. ఆ ఉద్యోగి పేరు కృష్ణకుమార్. భక్తులు స్వామివారి హుండీలో విదేశీ కరెన్సీ కూడా వేస్తుంటారు. పరకామణిలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కృష్ణకుమార్ ఈ విదేశీ కరెన్సీని దారిమళ్లిస్తున్నట్టు గుర్తించారు.
దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించిన టీటీడీ ఈవో శ్యామలరావు... అతడు తప్పు చేసినట్టు నిర్ధారణ కావడంతో సస్పెన్షన్ వేటు వేశారు. కాగా, కృష్ణకుమార్ పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని దారిమళ్లించినట్టు తెలిసింది.